EWS Quota Seats 2024 : ఈడ‌బ్యూఎస్(EWS) కోటా సీట్లల‌ను నిలిపివేత‌.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో ఈడ‌బ్యూఎస్ (EWS) కోటా సీట్ల జీవోను ఏపీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. వైద్య సీట్ల‌ల‌ను పెంచకుండానే ఈడ‌బ్యూఎస్ కోటా అమలు చేస్తున్నారని.., దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఠాకూర్‌ వాదించారు.

మెడిక‌ల్ సీట్లు పెంచి ఈడ‌బ్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 

దీంతో ఈ జీవోను నిలిపివేస్తూ..న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 6 వారాలకు వాయిదా వేసింది.

☛➤ Top 10 Universities In India: దేశంలోని టాప్ యూనివర్సిటీలు, కాలేజీల జాబితా విడుదల చేసిన కేంద్రం

#Tags