TS SET 2023 Notification Details : టీఎస్‌ సెట్-2023 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీలు ఇవే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ స్టేట్‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌సెట్‌–2023) నోటిఫికేష‌న్‌ను ఉస్మానియా యూనివర్సిటీ జూలై 29వ తేదీన‌(శ‌నివారం) విడుద‌ల చేసింది.
ts set notification 2023

ఈ టీఎస్‌సెట్‌–2023ను అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించ‌నున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ వంటి పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను వివిధ సబ్జెక్టులలో నిర్వహిస్తారు. 

దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ను కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. పేపర్-1 పరీక్ష 150 మార్కులకు, పేపర్-2ను 300 మార్కులను నిర్వహించనున్నారు.

టీఎస్‌ సెట్ సబ్జెక్ట్‌లు ఇవే.. : 
జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌(పేపర్‌1), జాగ్రఫీ, కెమికల్‌ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌-అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌ సైన్స్, లైఫ్‌ సైన్సెస్, జర్నలిజం-మాస్‌ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, సంస్కృతం, సోషల్‌ వర్క్, ఇన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్‌.

టీఎస్‌ సెట్ పరీక్ష విధానం : 
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు-100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు-200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

అర్హతలు ఇవే..
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌ఈ,ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం..
కంప్యూటర్‌ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలకు–100 మార్కులు, పేపర్‌–2లో 100 ప్రశ్నలకు–200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

పేపర్‌–1 :
ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

పేపర్‌–2 :
ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
     
పేపర్‌–1 ప్రశ్నపత్రం అందరికి కామన్‌గా ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు. పేపర్‌–2లో మాత్రం కొన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags