Admissions in Sainik School: సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు 7న పరీక్ష
భద్రాచలంటౌన్: వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో ని తెలంగాణ గిరిజన సంక్షేమ ట్రైబల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్లో ఆరో తరగతి, ఇంటర్ ఎంపీసీలో ప్రవేశాలకు ఈనెల 7న పరీక్ష నిర్వహిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులకు ఖమ్మంలోని ప్రతిభా కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈనెల 7న ఉదయం 9నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు ఇంటర్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని పీఓ సూచించారు.
#Tags