Telangana Engineering Colleges Fees 2025-26 : వచ్చే ఏడాది నుంచి కొత్త‌ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖారారు..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంట‌ర్ త‌ర్వాత ఇంజినీరింగ్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉన్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల కూడా అలాగే ఉంటాయి. తాజాగా తెలంగాణ నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) వ‌చ్చే ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు ఫీజుల‌ను ఖారారు చేసింది.

ఈ ఫీజులు ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది.  2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. అందుకే టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వెంకటేశ్వరరావు, ఓయూ రిజిస్ట్రార్‌ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు జులై 15న సమావేశమై కొత్త మార్గదర్శకాలపై చర్చించారు.

☛ BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

జూలై  చివ‌రికి..

జూలై నెల చివ‌రికి టీఏఎఫ్‌ఆర్‌సీ నుంచి  నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆగస్టు తొలి లేదా రెండో వారం నుంచి కళాశాలల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఆయా కళాశాలలు గత 2-3 విద్యా సంవత్సరాల ఆదాయ, వ్యయాలను కమిటీకి సమర్పించాల్సి ఉంది. అనంతరం ఆయా కళాశాలల ప్రతినిధులను పిలిచి ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజును తెలియజేస్తారు. ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుమును ఖరారు చేస్తారు. ఆ ఫీజుల వివరాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం జీవో జారీచేస్తేనే కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి.

#Tags