ISRO College: ఇస్రో కళాశాలలో సారపాక విద్యార్థికి సీటు

బూర్గంపాడు: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన షేక్‌ నీలోఫర్‌ ఇస్రో పరిధిలో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో సీటు సాధించింది.

సారపాకకు చెందిన నన్నేమియా ఐటీసీ పీఎస్‌పీడీలో పర్మనెంట్‌ కార్మికుడిగా పనిచేస్తుండగా, ఆయన కుమార్తె నీలోఫర్‌ ఐటీసీ అనుబంధ భద్రాచలం పబ్లిక్‌ స్కూల్‌, హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదివాక ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ ఐఐటీలో సీటు సాధించింది.

చదవండి: ISRO-NASA Mission to ISS: అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న భారతీయలు వీరే..

ఇంతలోనే ఆమెకు ఇస్రో అనుబంధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో సీటు దక్కింది. ఈ సందర్భంగా నీలోఫర్‌ మాట్లాడుతూ.. స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో రాణించాలన్న తన కల నెరవేరుతుండటం ఆనందంగా ఉందని చెప్పగా.. ఆమెను ఐటీసీ అధికారులు అభినందించారు.

#Tags