RGUKT Basar UG Phase I Selection List: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపు.. ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదే..

సాక్షి, హైదరాబాద్‌/బాసర/భైంసా: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు.

టెన్త్‌లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జూలై 3న‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెక్రటేరియట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌ వెంకటరమణ, జాయింట్‌ కన్వీనర్‌ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్‌ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను  www.rgukt.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

>> RGUKT UG Phase I Counseling Results 2024 - Click Here

8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్‌ 

జూలై 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్‌ కోటాలో విద్యార్థులను జూలై 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్‌ఐటీ ఉన్న నిర్మల్‌ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు.  

చదవండి: TG EAPCET Counselling 2024: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభం.. తొలి దశ కౌన్సెలింగ్‌ ఇలా..

కేటగిరీ వారీగా సీట్ల కేటాయింపు 

కేటగిరీ

బాలికలు

బాలురు

మొత్తం

ఓసీ

5

0

5

ఈడబ్ల్యూఎస్‌

123

61

184

బీసీ–ఏ

101

38

139

బీసీ–బి

259

79

338

బీసీ–సి

9

5

14

బీసీ–డి

201

82

283

బీసీ–ఇ

48

17

65

ఎస్సీ

156

73

229

ఎస్టీ

74

73

147

మొత్తం

976

428

1,404

ఎవరికి ఏ జీపీఏ వరకు సీటు

కేటగిరీ

బాలికలు

బాలురు

ఓసీ

10.2

10.2

ఈడబ్ల్యూఎస్‌

10

10

బీసీ–ఏ

10.1

10.1

బీసీ–బి

10.1

10.1

బీసీ–సి

9.2

9.5

బీసీ–డి

10.2

10.2

బీసీ–ఇ

10

10

ఎస్సీ

10

10

ఎస్టీ

10

10

#Tags