జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు 35 వేల సీట్లు

హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు దేశవ్యాప్తంగా వివిధ ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 35,197 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెయిన్స్‌లో అర్హత సాధించి, మంచి ర్యాంకు పొందిన విద్యార్థులకు ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 ఎన్‌ఐటీల్లో 15,485 సీట్లు ఉన్నాయి. అలాగే 13 ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న విద్యాసంస్థల్లో 2,173 సీట్లు, ఐదు ట్రిపుల్ ఐటీల్లో 827 సీట్లు, 23 సెల్ఫ్ ఫైనాన్సింగ్ విద్యాసంస్థల్లో 15,600 సీట్లు ఉన్నాయి. ఆయా సీట్లలో ర్యాంకు ఆధారంగా వారికి ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఆర్కిటెక్టర్, ప్లానింగ్ కోర్సులు నిర్వహిస్తున్న సంస్థల్లో 1,112 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా 35,197 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్ కోటా భర్తీలో జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత సాధించిన వారికి ఐఐటీల్లో 9,618 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తుది ర్యాంకులు ప్రకటించి, ప్రవేశాలు చేపట్టే నాటికి సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

ఎన్‌ఐటీల్లో సీట్ల వివరాలు...
మన రాష్ట్రంలోని వరంగల్ ఎన్‌ఐటీలో 740 సీట్లతో పాటు తమిళనాడులోని తిరుచిరాపల్లి- 814, కేరళలోని కాలిక ట్- 937, కర్ణాటకలోని మంగళూరు- 740, మహారాష్ట్రలోని నాగ్‌పూర్- 738, రాజస్థాన్‌లోని జైపూర్- 710, హర్యానాలోని కురుక్షేత్ర- 832, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్- 800, గుజరాత్‌లోని సూరత్- 693, ఒడిశాలోని రూర్కేలా- 580, హిమాచల్‌ప్రదేశ్‌లోని హామిర్‌పూర్- 508, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్- 601, బీహార్‌లోని పాట్నా- 554, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్- 813, మధ ్యప్రదేశ్‌లోని భోపాల్- 937, పంజాబ్‌లోని జలంధర్- 786, త్రిపురలోని అగర్తలా- 757, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్- 893, అస్సాంలోని సిల్చార్- 490, జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్‌ఐటీలో 632 సీట్లు ఉన్నాయి. ఇక కొత్త ఎన్‌ఐటీల విషయానికొస్తే అరుణాచల్‌ప్రదేశ్ ఎన్‌ఐటీలో 90, ఢిల్లీ- 90, గోవా- 90, మణిపూర్- 90, మేఘాలయ- 90, మిజోరాం- 90, నాగాలాండ్- 90, పుదుచ్చేరి- 90, సిక్కిం- 90, ఉత్తరాఖండ్‌లో 120 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

ట్రిపుల్ ఐటీల్లో...
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో 210 సీట్లతో పాటు అలహాబాద్‌లో 214, అమేథీలో 72, గ్వాలియర్‌లో 115, జబల్‌పూర్‌లో 156, కాంచీపురంలో 60 సీట్లు ఉన్నాయి.

ఐఐటీల్లో సీట్లు...
ముంబై ఐఐటీలో 880, ఢిల్లీలో 851, గువాహటిలో 615, కాన్పూర్‌లో 827, ఖరగ్‌పూర్‌లో 1341, మద్రాసులో 838, రూర్కేలాలో 1155, భువనేశ్వర్‌లో 120, గాంధీనగర్‌లో 120, హైదరాబాద్‌లో 140, ఇండోర్‌లో 120, మండీలో 120, పాట్నాలో 120, రోపార్‌లో 120, రాజస్థాన్‌లో 160 సీట్లు ఉన్నాయి. అలాగే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో 1057, ధన్‌బాద్ ఐఎస్‌ఎంలో 1034 సీట్లు అందుబాటులో ఉన్నాయి.





#Tags