ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
వచ్చే నెల 1వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వెరిఫికేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆధార్ కార్డును కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వెరిఫికేషన్ సందర్భంగా విద్యార్థుల బయోమెట్రిక్ డేటా తీసుకుని.. పరీక్ష సమయంలో తీసుకున్న వివరాలతో పోల్చి చూస్తారు. కాబట్టి విద్యార్థులు స్వయంగా హాజరుకావాలని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి, క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో తేదీల వారీగా, ర్యాంకుల వారీగా వెరిఫికేషన్ చేపట్టే తేదీల వివరాలు, అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇతర వివరాలను tseamcet.nic.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఇక వెబ్ ఆప్షన్ల తేదీలను కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించాక ప్రక టించనున్నారు.
విద్యార్థులూ ఇవి మరచిపోవద్దు:
ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, పదో తరగతిమార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2016 జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారికి), కుల ధ్రువీకరణ పత్రం(వర్తించేవారు), స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు (వర్తించేవారు), నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తెలంగాణలో పదేళ్ల కాలానికి సంబంధించిన నివాస సర్టిఫికెట్, విద్యాసంస్థల్లో రెగ్యులర్‌గా చదవని వారు నివాసం సర్టిఫికెట్...ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. ఇక పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వని విద్యార్థుల నుంచి వెరిఫికేషన్ సందర్భంగా సేకరిస్తారు.
ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు:
మహబూబ్‌నగర్-ప్రభుత్వ పాలిటెక్నిక్; వనపర్తి- కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్; నల్లగొండ- ప్రభుత్వ పాలిటె క్నిక్, నాగార్జున డిగ్రీ కాలేజీ; కొత్తగూడెం (రుద్రంపూర్) ప్రభుత్వ పాలిటె క్నిక్; ఖమ్మం-ఎస్‌ఆర్, బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; వరంగల్-ప్రభుత్వ పాలిటె క్నిక్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ; బెల్లంపల్లి (ఆదిలాబాద్)-ప్రభుత్వ పాలిటెక్నిక్; నిజామాబాద్- ప్రభుత్వ పాలిటెక్నిక్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; మెదక్-ప్రభుత్వ పాలిటె క్నిక్ (విమెన్); రాజగోపాల్‌పేట్ (సిద్ధిపేట)- ప్రభుత్వ పాలిటెక్నిక్; కరీంనగర్-డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ (విమెన్), ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; ఈస్ట్ మారేడ్‌పల్లి (సికింద్రాబాద్)- గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ప్రింటింగ్ టెక్నాలజీ; హైదరాబాద్‌లోని చందూలాల్ బారాదరి (పాతబస్తీ)-క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్; రామంతాపూర్-జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, కూకట్‌పల్లి- జేఎన్టీయూహెచ్, మాసాబ్‌ట్యాంకు-సాంకేతిక విద్యాభవన్.
కన్వీనర్ కోటాకు మాత్రమే..!
ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లకు మాత్రమే 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. మిగతా 30 శాతం మేనేజ్‌మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేస్తాయి. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించాక.. ప్రవేశాల కమిటీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనుంది. తరువాత యాజమాన్యాలు మేనేజ్‌మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా సీట్లను భర్తీ చేసుకుంటాయి. ఈ సీట్లలో చేరాలనుకునే విద్యార్థులు ప్రస్తుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. కన్వీనర్ కోటా సీట్ల కోసం మాత్రం ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని వెల్లడించారు.

#Tags