ఎంసెట్ దరఖాస్తుల గడువు నేటితో ఆఖరు ..రూ.500 లేట్ ఫీజుతో 18 వరకు గడువు
హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు 3.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణరావు తెలిపారు. శుక్రవారం రాత్రి వరకు ఈ దరఖాస్తుల సంఖ్య నాలుగు లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తుల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 99,931 మంది, ఇంజనీరింగ్‌కు 2,51,790 మంది, రెండింటికి 1,566 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎంసెట్‌కు సంబంధించిన కొన్ని ప్రధాన తేదీలు
ఎంసెట్‌కు సంబంధించిన కొన్ని ప్రధాన తేదీలు
- ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు
- ఈనెల 18 వరకు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి రోజు
- 25వ తేదీ వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు
- వచ్చే నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- మే 8వ తేదీ వరకు రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు.
- రూ.10,000 ఆలస్య రుసుముతో మే 19వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
- 22వ తేదీన ఎంసెట్ రాత పరీక్ష
- ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్
- మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంట ల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్ష ఉంటుంది
- మే 24న ప్రాథమిక కీ విడుదల
- 31వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ
- జూన్ 9వ తేదీన ర్యాంకుల వెల్లడి
#Tags