IIIT Basara: ఆర్జీయూకేటీలో అవగాహన సదస్సు

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పీ యూసీ పూర్తి చేసి బీటెక్‌ ఫస్టియర్‌లో చేరే విద్యార్థు ల కోసం ఆగ‌స్టు 28న‌ అవగాహన సదస్సు ప్రారంభించారు.

ఏఐసీటీఈ నిబంధనల మేరకు వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ ఆదేశాలతో పదిరోజులపాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ల ప్రా ముఖ్యత, పరిచయం, వివిధ డిపార్ట్‌మెంట్లలోని సౌ కర్యాలు, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ప్లేస్‌మెంట్‌ గణాంకాలు, బీటెక్‌ తర్వాత కెరీర్‌ మార్గదర్శకాల ప్ర స్తావన తదితర అంశాల గురించి ప్రొఫెసర్లు, నిపుణులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.

చదవండి: Disabled Quota in RGUKT: ట్రిపుల్‌ ఐటీలో వికలాంగుల కోటా కింద సీట్ల భర్తీ

సివిల్‌ ఇంజినీరింగ్‌ విభా గం అధ్యాపకుడు రణదీర్‌ సాగి మాట్లాడుతూ.. సమాజంలో ఉత్తమ ఇంజినీర్‌ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో సి విల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన 84 మంది పూర్వ విద్యార్థులు ఏఈఈలుగా ఎంపికై నట్లు పే ర్కొన్నారు. వీరితో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గుర్తు చేశారు. సమన్వయకర్త కిరణ్‌కుమార్‌ ఆత్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

#Tags