AP RGUKT 2nd Phase Admission 2024-25: రెండో విడత ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 ప్ర‌వేశాల‌కు కౌన్సిలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.

అయితే ఇటీవ‌లే తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన విష‌యం తెల్సిందే. ఈ నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో మొత్తం 4140 సీట్లు ఉన్నాయి. వీటీలో 3396 సీట్ల‌కు ప్ర‌వేశాలు పొందారు. అయితే మిగిలిన 744 సీట్ల‌కు రెండోవిడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌కు జులై 30వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

☛ AP IIIT Counselling Dates 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్ 2024-25 తేదీలు ఇవే.. మొత్తం ఉన్న సీట్లు ఇవే..

క్యాంపస్ మార్పునకు కూడా..
మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొదటి విడతలో ఎంపికై రిపోర్టు చేయని అభ్యర్థులు జులై 30వ తేదీ లోపు రెండో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది. ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన వారి వివరాలను ఆగస్టు 3వ తేదీన‌ ప్రకటించ‌నున్నారు.

➤☛ Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

#Tags