Engineering Services Examination : నాలుగు విభాగాల్లో ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామినేషన్.. నోటిఫికేష‌న్‌కు తేదీ!

➔    ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ తేదీ: 2024,సెప్టెంబర్‌ 18
➔    దరఖాస్తు చివరి తేదీ: 2024, అక్టోబర్‌ 8
➔    ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: 2025, ఫిబ్రవరి 9
➔    మెయిన్స్‌ పరీక్ష తేదీ: 2025, జూన్‌ 22
నాలుగు బ్రాంచ్‌లు
యూపీఎస్‌సీ నోటిఫికేషన్లలో మరో ఉన్నత స్థా­యి పరీక్ష.. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్షను నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
ఈఎస్‌ఈ అర్హతలు
ఆయా బ్రాంచ్‌లతో బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు తేదీ నాటికి చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పోటీ పడొచ్చు.

NDA and NA Notification : ఈ అర్హ‌త‌తోనే త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్‌తో కొలువు అవ‌కాశం.. ఈ ప‌రీక్ష‌తోనే..

మూడు దశల్లో ఎంపిక
➔    ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ కూడా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. తొలిదశ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి..పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఆప్టిట్యూడ్‌); పేపర్‌–2 (ఇంజనీరింగ్‌ సంబంధిత సబ్జెక్ట్‌). పేపర్‌–1ను 200 మార్కులు, పేపర్‌–2ను 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–2 అభ్యర్థి దరఖాస్తు సమయంలో పేర్కొన్న సబ్జెక్ట్‌పై జరుగుతుంది.
రెండో దశ మెయిన్‌
ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. రెండు పేపర్లుగా..ఒక్కో పేపర్‌కు 300 మార్కులతో మొ­త్తం 600 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న విభాగానికి సంబంధించిన పేపర్లలో ఈ పరీక్ష జరుగుతుంది.
ఇంటర్వ్యూ
ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో చివరి, మూడో దశ.. పర్సనాలిటీ టెస్ట్‌గా పిలిచే పర్సనల్‌ ఇంటర్వ్యూ. 200 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. n మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. 

Sydney Mclaughlin: ప్రపంచ రికార్డు.. ఈ ఈవెంట్‌లో వరుసగా రెండు స్వర్ణాలు సాధించిన మ‌హిళ ఈమెనే..

#Tags