ECE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'ECE' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా వ‌చ్చే.. లాభాలు ఇవే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతున్న విష‌యం తెల్సిందే. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కౌన్సిలింగ్ ప్ర‌క్రియ జ‌రుతుంది. అయితే ప్ర‌స్తుతం బీటెక్‌లో జాయిన్ అవ్వాల‌నుకునే విద్యార్థులు.. వీరి త‌ల్లిదండ్రులు ముఖ్యంగా ఎలాంటి బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే.. మంచి భ‌విష్య‌త్ ఉంటుంది.

అలాగే బీటెక్‌లో ఎక్కువ మంది ఎంపిక చేసుకునే బ్రాంచ్ సీఎస్సీ. 'సీఎస్సీ' త‌ర్వాత.. ఎక్కువ‌గా 'ఈసీఈ' బ్రాంచ్ వైపే ఆస‌క్తి చూపిస్తారు. 

ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ) బ్రాంచ్‌ నైపుణ్యాలతో కోర్ సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో ఉప‌యోగాలు 'ఈసీఈ' బ్రాంచ్ వ‌ల్ల ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంజ‌నీరింగ్‌లో 'ఈసీఈ' బ్రాంచ్ ఎంపిక చేసుకునే విద్యార్థుల‌కు ఈ బ్రాంచ్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలను మీకోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా అందిస్తోంది.

ఐఐటీలు, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో.. 
ఈసీఈలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత చదువులు, పరిశోధనల వైపు ఆసక్తి ఉంటే.. గేట్ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లో మాస్టర్స్చే యాలనుకునే అభ్యర్థులు జీఆర్‌ఈ, టోఫెల్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అంతర్జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్ లభిస్తుంది.

☛ CSE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

ఈసీఈతో.. ఉన్న‌త ఉద్యోగావకాశాలు ఇలా..

ఈసీఈ అభ్యర్థులు.. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో, మొబైల్ కమ్యూనికేషన్, టెలి కమ్యూనికేషన్ అండ్ ఐటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, ఏరోనాటికల్, మిలటరీ తదితరరంగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇంటెల్, మోటరోలా, ఇస్రో, బీహెచ్ ఈఎల్, క్యాప్ జెమిని, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో కూడా అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

టాప్‌ సాప్ట్‌వేర్ కంపెనీలో..
ఆధునిక సాంకేతిక విధానాలు.. నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం సంస్థలు అన్వేషిస్తుండటం వంటివి ఈసీఈ విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఈసీఈ బ్రాంచ్‌తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, సామ్‌సంగ్, వంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మరోవైపు బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్ డీవో, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ.. కొత్త టెక్నాలజీలు ఆవిష్కరిస్తుండటంతో విద్యార్థులు ఈసీఈని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకుంటున్నారు.

విస్తృతంగా ఉపాధి అవకాశాలు..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువు లేకుండా బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్, సమాచారం ఒక భాగంగా మారిపోయింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఇలాంటి ఎన్నో మార్పులకు మూలం.. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు. వీటిని లోతుగా అధ్యయనం చేసే బ్రాంచ్.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ). ప్రస్తుతం విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ఈసీఈ ఒకటి. ఈసీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఇటు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలతోపాటు అటు ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.

#Tags