EAMCET 2023: పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌–2023 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎంసెట్–2023 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో యూజీ నీట్‌ పరీక్షలు జరగనుండగా.. మరోవైపు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ పరీక్షలు సైతం ఉన్నాయి. దీంతో టీఎస్‌ ఎంసెట్‌–2023 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం టీఎస్‌ఎంసెట్‌–2023 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు మే నెల 7 నుంచి 9వరకు జరగాల్సి ఉంది.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

తాజా నిర్ణయంతో ఈ పరీక్షలు మే నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు మార్చి 31న ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్దేశించిన తేదీల్లోనే జరుగుతాయన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 10వ తేదీ, 11వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. 

చదవండి: EAMCET 2023: పేపర్లకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

#Tags