EAMCET 2023: ఈ నోటిఫికేషన్‌ తర్వాతే ఎంసెట్‌ తేదీల ప్ర‌క‌ట‌న‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ మే నెలలో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది.
ఈ నోటిఫికేషన్‌ తర్వాతే ఎంసెట్‌ తేదీల ప్ర‌క‌ట‌న‌

జేఈఈ మెయిన్స్‌ నోటిఫికేషన్‌ తర్వాత ఎంసెట్‌ తేదీలపై అధికారులు స్పష్టతకు వచ్చే అవకాశముంది. దీంతో పాటే ఈసారి విధివిధానాలు ఏవిధంగా ఉండాలనే దానిపై చర్చించాలని నిర్ణయించారు. రెండేళ్లుగా ఎంసెట్‌ నిర్వహణ ఆలస్యంగా చేపడుతున్నారు. కోవిడ్‌ మూలంగా విద్యా సంస్థలను సరిగా నిర్వహించకపోవడం, జేఈఈ పరీక్ష తేదీలను తరచూ మార్చడం వంటి కారణాలు ప్రతిబంధకంగా మారాయి. అయితే 2022లో ఇంటర్‌ కాలేజీలు సకాలంలోనే మొ దలైన నేపథ్యంలో పరీక్షలు మార్చిలో జరుగుతాయి.

చదవండి: Top Engineering Colleges 2022 - Andhra Pradesh | Telangana

ఏప్రిల్‌ చివరి నాటికి ఫలితాలు వెల్లడయ్యే వీలుంది. ఇదే క్రమంలో జేఈఈ మెయిన్స్‌ కూడా ఫిబ్రవరిలో ఒకసారి, ఏప్రిల్‌ చివర, లేదా మే మొదటి వారంలో జరిగే వీలుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత వస్తే మే రెండు లేదా ఆఖరి వారంలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించే యోచనలో అధికారులున్నారు. రెండేళ్లుగా ఇంటర్‌ మార్కుల వెయిటేజీ ఎత్తివేశారు. ఈసారీ దీన్నే అనుసరించాలనే ప్రతిపాదనలు ఉన్నత వర్గాల నుంచి వస్తున్నాయి. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సిలబస్‌ విషయంలోనూ ఇంటర్‌ బోర్డు స్పష్టత ఇస్తూ ఈసారి వందశాతం సిలబస్‌ ఉంటుందని తెలిపింది. ఎంసెట్‌ ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ దీన్ని పరిగణనలోనికి తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సన్నద్ధత అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

చదవండి: College Predictor 2022 - AP EAPCET TS EAMCET

#Tags