Engineering Seats Spot Admisisons 2024: ఎంసెట్‌లో క్వాలిఫై అవ్వకపోయినా ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరొచ్చు.. అదెలా అంటే..

ఇంజనీరింగ్‌లో చేరాలంటే ఎప్‌సెట్‌ (ఎంసెట్‌)ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సిందే. అయితే ఒకవేళ మీరు ఎప్‌సెట్‌(EAPCET)లో అర్హత సాధించకపోయినా, క్వాలిఫై అయి, వివిధ కారణాలతో కాలేజీలో చేరలేకపోయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. వీరికి కూడా బీటెక్‌లో చేరేందుకు స్పాట్‌ అడ్మిషన్ల(EAMCET Spot Admissions) రూపంలో అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Group-I Recruitment: గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎప్‌సెట్‌ క్వాలిఫై అయిన వారే కాకుండా, క్వాలిఫై కానివారు సైతం ఈ సీట్లకు పోటీపడవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. నేడు(ఈనెల 30)నుంచి సెప్టెంబర్‌ 2 వరకు స్పాట్‌ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అయితే ఈ సీట్లలో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. కాలేజీ మొత్తం ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌లో ఒరిజినల్‌ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.

మిగిలి ఉన్న సీట్ల వివరాలివే..
ఉస్మానియా ఇంజినీరింగ్‌ కాలేజీలో 34 సీట్లు,జేఎన్టీయూ, కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలు కలుపుకొంటే 1,623 సీట్లు ఉన్నాయి. కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్‌ కాలేజీల్లో ఈ నెల 30న జగిత్యాల, మంథని కాలేజీల్లో ఆగస్టు 31న వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సెప్టెంబర్‌ 2న స్పాట్‌ అడ్మిషన్స్‌ ద్వారా సీట్లను భర్తీచేస్తారు. స్పాట్‌ అడ్మిషన్ల కోసం విద్యార్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని అధికారులు తెలిపారు.

Wipro Cuts Offer Letters To Freshers: ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన విప్రో.. ఆ నియామకాలన్నీ రద్దు

స్పాట్ కౌన్సెలింగ్‌కు కావలసిన ధ్రువపత్రాలు: 
ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో
స్టడీ సర్టిఫికేట్‌
ఇంటర్‌ మార్కుల మెమో
టీజీఈఏపీసెట్‌-2024 ర్యాంక్‌ కార్డు 
కుల, నివాస ధ్రువీకరణ పత్రం 

#Tags