TS DSC 2024 Result Release Date : ఏక్ష‌ణంలోనైన డీఎస్సీ-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. అలాగే తుది కీ కూడా.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను అత్యంత త్వ‌ర‌లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌డానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తుది ఫ‌లితాల‌తో పాటు ఫైన‌ల్ కీ ని కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ స్కూల్స్‌లో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

➤ Telangana VRO and VRA Jobs Notification 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త నోటిఫికేషన్ ద్వారా..

ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు..
అయితే డీఎస్సీ-2024 పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా.. అని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అధికారులు తీపికబురు చెప్పారు. డీఎస్సీ రాత పరీక్ష ఫలితాలను ఏక్ష‌ణంలోనైన‌ విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని కుదిరితే ఈ డీఎస్సీ ఫ‌లితాల‌ను ఈ నెల చివ‌రిలోపు ఎప్పుడైన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 TS DSC 18 Questions Repeated 2024 : డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల్లో ఇంత దార‌ణ‌మా..! 18 ప్ర‌శ్న‌లు.. మ‌ళ్లీ రోజు అవే 18 ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా..? ఇంకా..

ఈ సారి రికార్డు స్థాయిలో.. 
ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు సంబంధించిన ప్రాధ‌మిక కీ ని విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే ఎన్నడూలేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో ఏకంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే డీఎస్సీలో అడిగిన ప్రశ్నలపై వచ్చిన 28 వేలకుపైగా అభ్యంతరాలు పరిశీలించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీని విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో ప్రశ్నపై పలువురు అభ్యంతరం తెలపడంతో వాటి సంఖ్య వేలల్లో ఉందని, సబ్జెక్టు నిపుణుల పరిశీలన అనంతరం ఆగస్టు నెలాఖరులో తుది ఆన్సర్‌ కీ వెల్లడిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నెలలో జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు.

#Tags