TS DSC 2024 Key 28000 Above Objections : డీఎస్సీ-2024 ప్రాథ‌మిక 'కీ' పై 28000 మందికి పైగా అభ్యంత‌రాలు.. ఈ ప్ర‌శ్న‌లకు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల‌ను ఎన్నో ఆటంకాల మ‌ధ్య నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఇటీవ‌లే డీఎస్సీ-2024 ప్రాథ‌మిక కీ ని కూడా విడుద‌ల చేశారు.

ఈ కీ పై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించింది. ఈ డీఎస్సీ-2024 ప్రాథ‌మిక కీ లో కొన్ని ప్ర‌శ్న‌లు త‌ప్పుగా ఉన్నాయ‌ని.. దాదాపు 28 వేలకు పైగా అభ్య‌ర్థులు అభ్యంతరాలు తెలిపారు. ఒక్కో ప్రశ్నపై పలువురు అభ్యంతరం తెలపడంతో వాటి సంఖ్య వేలల్లో ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

☛➤ TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని త‌ప్పులా..? ఈ 18 ప్ర‌శ్న‌ల‌కు మార్కుల‌ను..

మరో రోజు అవే ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా.. ?
డీఎస్సీ-2024 ఆన్‌లైన్‌ పరీక్షల్లో ఒక విడతలో వచ్చిన 18 సాంఘికశాస్త్రం ప్రశ్నలు మరో రోజు అవే ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా పునరావృతమయ్యాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ)-తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. 

113 నుంచి 130 ప్ర‌శ్న‌ల‌కు వరకు..
సాంఘిక శాస్త్రం నుంచి 18 ప్రశ్నలు ఇచ్చారు. జులై 19వ తేదీ ఉదయం, 23వ తేదీ మధ్యాహ్నం (సెకండ్‌ షిఫ్ట్‌) పరీక్షల్లో వచ్చిన సాంఘికశాస్త్రం ప్రశ్నల‌ సంఖ్య 113 నుంచి 130 వరకు పునరావృతమయ్యాయి. ఒక్క అక్షరం ఒక్క ప్రశ్న తేడా లేకుండా ఇచ్చారు.

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ఈ డీఎస్సీ ప‌రీక్ష‌ల్లో మరికొన్ని రకాల తప్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జులై 30వ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్‌ అసిస్టెంట్‌  సోషల్‌ తెలుగు మాధ్యమం పరీక్షలో కిందివాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్నను అడగగా.. తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగారు. ఆరు ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి.

☛➤ TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..

ఈ 18 ప్రశ్నలను తొలగించాలా..? లేదా..?
రిపీట్ అయిన ఈ 18 ప్రశ్నల మీద నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. వాళ్లు సమావేశంలో 18 ప్రశ్నలు తొలగించాలా లేదా ఆన్‌లైన్‌ కాబట్టి ఏమి కాదులే అలానే ఉంచాల అని చర్చించడం జరిగింది. 2, 3 రోజుల్లో నిపుణుల కమిటీ కీల‌క‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

#Tags