TS DSC 2023 Application Edit Option : డీఎస్సీ దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 5089 టీచ‌ర్‌ ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను సెప్టెంబ‌ర్ 8వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే అక్టోబర్ 28వ తేదీన‌ డీఎస్సీ దరఖాస్తు గ‌డువు ముగిసింది.
TS DSC 2023 Application Edit Option

ఈ నేపథ్యంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. నవంబరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మేర‌కు తెలంగాణ విద్యాశాఖ అక్టోబ‌ర్ 31వ తేదీన ఒక‌ ప్రకటన జారీ చేసింది.

☛ మీ డీఎస్సీ-2023 దరఖాస్తులో దొర్లిన తప్పులను ఈ లింక్ ద్వారా ఎడిట్ చేసుకోండి

ప‌రీక్షావిధానం ఇలా..
ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో జరుగుతుంది. స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ, భాషా పండితులకు నిర్వహించే పరీక్షల్లో 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అర మార్కు చొప్పున 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీరికి టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే మొత్తం 100 మార్కులకు పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు కేటాయిస్తారు. ఇక పీఈటీ, పీఈడీలకు టెట్‌ అవసరం లేదు. అందువల్ల వారికి 100 మార్కులకు టీఆర్‌టీ నిర్వహిస్తారు.

ప‌రీక్ష‌ల తేదీలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో డీఎస్సీ ప‌రీక్ష‌ల తేదీల‌ను మార్పు చేసిన విష‌యం తెల్సిందే. వాయిదాప‌డ్డ‌ ఈ డీఎస్సీ పరీక్షలు.. జనవరి 2024 చివరి వారం లేదా ఫిబ్రవరి 2024 మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టీఆర్‌టీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

#Tags