DSC 2024 Final Key: డీఎస్సీ తుది ‘కీ’లోనూ తప్పులు: అభ్యర్థులు.. Key కోసం క్లిక్ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)కు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టరేట్‌ విడుదల చేసిన తుది కీలో తప్పులున్నట్టు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలువురు అభ్యర్థులు సెప్టెంబర్ 9న‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చి అధికారులను కలిశారు. పాఠ్యపుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వలేదని, కొన్ని సమాధానాలు మార్చారని వివరించారు.

చదవండి: ➤☛ TS DSC Final Key 2024 కోసం క్లిక్ చేయండి

తప్పులున్న కీ ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలపై అధికారులు స్పందించారు. మరోసారి పరిశీలన కమిటీకి అభ్యంతరాలను పంపుతామని చెప్పారు. ఒకవేళ తప్పులుంటే సరిచేసిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

చదవండి: ☛➤ డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల్లో ఇంత దార‌ణ‌మా..! 18 ప్ర‌శ్న‌లు.. మ‌ళ్లీ రోజు అవే 18 ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా..? ఇంకా..

డీఎస్సీ తుది కీని విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. అందులో వచ్చిన ప్రశ్నలు టెట్‌లోనూ వచ్చాయి. వాటిల్లో సమాధానాలు ఒక రకంగా ఉంటే డీఎస్సీ ఫైనల్‌ కీలో మరోలా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు.

#Tags