DOST 3rd Phase Seats Allotment 2023 : DOST 2023 మూడో విడ‌త‌ సీట్లు కేటాయింపు.. ఈ తేదీలో..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వ‌హించే.. మూడో విడ‌త‌ Dost 2023 సీట్లు కేటాయింపును జూలై 20వ తేదీన విడుద‌ల చేశారు.ఈ మేర‌కు తెలంగాణ‌ ఉన్నత విద్యా మండలి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలో ఈ దశలో 72,949 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
DOST Phase 3 Seats Allotment 2023

ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు.. జూలై 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కళాశాలలో సీసీఓటీపీని సమర్పించి సీట్లను ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

☛ DOST 2023 మూడో విడ‌త‌ సీట్లు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి​​​​​​​

#Tags