Diploma Courses: టీటీడీ ఆధ్వర్యంలో డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలు.. ఈ కళాశాలలోనే..!

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల డిప్లొమా, రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల. ప్రవేశానికి దరఖాస్తుల వివరాలు ఇలా..

సాక్షి ఎడ్యుకేషన్‌: తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల డిప్లొమా, రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద టీటీడీ రూ.లక్ష బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తోంది.

కోర్సుల వివరాలు
»    నాలుగేళ్ల డిప్లొమా కోర్సు(సంప్రదాయ కలంకారీ కళ), రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సు(సంప్రదాయ కలంకారీ కళ).
»    విభాగాలు: శిలా శిల్ప, సుధా(సిమెంట్‌) శిల్ప, ఆలయ నిర్మాణం, దారు(కొయ్య) శిల్ప, లోహశిల్ప, సంప్రదాయ చిత్రలేఖనం.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, మౌఖిక పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తిచేసి ప్రధానోపాధ్యాయుడు, శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల, అలిపిరి రోడ్, తిరుపతి చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024.
»    దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.tirumala.org

AIAPGET Notification 2024: ఏఐఏపీజీఈటీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులు వీరే..

#Tags