US Open: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్

2024 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా 23 ఏళ్ల ఇటలీ టెన్నిస్‌ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సినెర్‌ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు, టాప్‌ సీడ్‌ హోదాకు న్యాయం చేస్తూ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో సినెర్‌ విజేతగా నిలిచాడు. 

విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ.30 కోట్ల 23 లక్షలు), రన్నరప్‌ ఫ్రిట్జ్‌కు 18 లక్షల డాలర్లు (రూ.15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

US Open 2024: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఈమెనే.. ప్రైజ్ మనీ ఎంతంటే..

➣ ఈ ఏడాది సినెర్‌ గెలిచిన టైటిల్స్ ఆరు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్, రోటర్‌డామ్‌ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో సినెర్‌ విజేతగా నిలిచాడు. 
➣ ఈ సంవత్సరం సినెర్‌ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు.

➣ తన కెరీర్‌లో ఒకే ఏడాది ఫైనల్‌ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్‌ సినెర్‌. గతంలో గిలెర్మో విలాస్‌ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌), జిమ్మీ కానర్స్‌ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు. 

➣ ఒకే ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన నాలుగో ప్లేయర్‌ సినెర్‌. ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ (సెర్బియా) మూడుసార్లు చొప్పున.. 1988లో మాట్స్‌ విలాండర్‌ (స్వీడన్‌) ఒకసారి ఈ ఘనత సాధించారు. 

Paris Paralympics Winners: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు.. విజేతలు వీరే..

#Tags