Powerlifting: అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది.
మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.
జూలై 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. సుకన్య పవర్‌లిఫ్టింగ్‌లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో కూడా అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించింది.
తను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి సహాయం చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యం కోల్పోకుండా క్రీడలలో రాణిస్తున్నానని సుకన్య తెలిపింది.
Roller Skating Championship: ప్రపంచ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ అమ్మాయికి పసిడి పతకం
#Tags