BCCI అధ్యక్ష, కార్యదర్శులు ఆరేళ్లపాటు పని చేయవచ్చు: సుప్రీం కోర్టు

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక పరిణామం. నియమావళిలో మార్పులకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించిన బోర్డుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి.
Supreme Court allows Ganguly and Shah to continue in BCCI

ఇకపై బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో కలిపి వరుసగా 12 ఏళ్లు పదవిలో ఉండే అవకాశంతో పాటు ఆ తర్వాతే మూడేళ్లు విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) ఇచ్చే విధంగా నిబంధనను మార్చుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడా బెంచ్‌ సెప్టెంబర్ 15న దీనిపై స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా రాష్ట్ర క్రికెట్‌ సంఘంలో లేదా బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవీకాలం ముగిసిన తర్వాత కనీసం మూడేళ్లు విరామం ఇచ్చిన తర్వాతే మళ్లీ ఏదైనా పదవి కోసం పోటీ పడవచ్చు.

Also read: CMIE Reports: నిరుద్యోగం పైపైకి.. యువత, మహిళలపై తీవ్ర ప్రభావం

అయితే ఇప్పుడు సుప్రీం అనుమతించిన దాని ప్రకారం బీసీసీఐలో ఆరేళ్లు, రాష్ట్ర క్రికెట్‌ సంఘంలో ఆరేళ్ల పదవిని వేర్వేరుగా చూడనున్నారు. అంటే రాష్ట్ర సంఘంలో పని చేసిన తర్వాత కూడా బీసీసీఐలో వరుసగా మూడేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలు (మొత్తం ఆరేళ్లు) పదవి చేపట్టే అవకాశం ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకారం అందరికంటే ఎక్కువ ప్రయోజనం బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షాలకు లభించనుంది. వీరిద్దరు 2019లో పదవిలోకి వచ్చారు. గత నిబంధనల ప్రకారం వారిద్దరి పదవీ కాలం ఇటీవలే ముగిసింది. అయితే పదే పదే వ్యక్తులు మారకుండా అనుభవజు్ఞలు ఎక్కువ కాలం బోర్డులో ఉంటే ఆటకు మేలు జరుగుతుందనే వాదనతో సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. ఈ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో గంగూలీ, జై షా మరోసారి ఎన్నికై 2025 వరకు తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం ఉత్తర్వుల కోసం వేచి చూస్తూ ఈ నెల చివర్లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసిన బీసీసీఐ త్వరలోనే ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైంది. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags