IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు ఇదే..

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తా చాటింది.

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం ఘన విజయాన్ని అందుకుంది. మార్చి 27వ తేదీ జరిగిన పోరులో రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌. 

హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు).. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)..  ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించింది. ‘లోక్‌ బాయ్‌’ తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

Australian Grand Prix: ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత కార్లోస్‌ సెయింజ్‌

ఐపీఎల్‌లో మొదటి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు..
148/2 - SRH vs MI, హైదరాబాద్, 2024
141/2 - MI vs SRH, హైదరాబాద్, 2024
131/3 - MI vs SRH, అబుదాబి, 2021
131/3 - PBKS vs SRH, హైదరాబాద్, 2014
130/0 - డెక్కన్ ఛార్జర్స్ vs MI, ముంబై, 2008
129/0 - RCB vs PBKS, బెంగళూరు, 2016

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు..
277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024
263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013
257/5 - LSG vs PBKS, మొహాలి, 2023
248/3 - RCB vs GL, బెంగళూరు, 2016
246/5 - CSK vs RR, చెన్నై, 2010

T20I Rankings: ‘టాప్‌’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్ యాదవ్

#Tags