World Cup 2024 Munich: ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు రెండో పతకం

మ్యూనిక్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో పతకం లభించింది.

జూన్ 7వ తేదీ జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కాంస్య పతకం సాధించింది.

ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 452.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇప్పటివరకు రెండు పతకాలు లభించాయి. జూన్ 6వ తేదీన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో భారత షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు.

Sunil Chhetri: భారత ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి వీడ్కోలు!

#Tags