Sahaja: డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయే భారత్‌ నంబర్‌వన్‌

అంతర్జాతీయ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టెన్నిస్‌ ప్లేయర్‌ సహజ యామలపల్లి భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా అవతరించింది.

సెప్టెంబ‌ర్ 9వ తేదీ విడుదల చేసిన ప్రపంచ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల సహజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 302వ ర్యాంక్‌కు చేరుకుంది. 

చాలా కాలంగా భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న 31 ఏళ్ల అంకిత రైనా 24 స్థానాలు పడిపోయి 307వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో సహజ 27 మ్యాచ్‌ల్లో గెలిచి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇటీవ‌ల‌ డొమినికన్‌ రిపబ్లిక్‌లో జరిగిన పుంటా కానా ఓపెన్‌ ఐటీఎఫ్‌ టోర్నీలో సహజ సెమీఫైనల్లో నిష్క్రమించింది. 

Paris Paralympics Winners: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు.. విజేతలు వీరే..

#Tags