ISSF World Cup: రిథమ్‌ సాంగ్వాన్‌కు కాంస్యం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీని భారత్‌ కాంస్య పతకంతో ప్రారంభించింది.

అజర్‌బైజాన్‌లో మే 10న  మొదలైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో రిథమ్‌ సాంగ్వాన్‌ 219.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ 154.8 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ సరబ్‌జిత్‌ సింగ్‌ 198.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)

#Tags