Rafael Nadal: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రఫేల్ నదాల్
టెన్నిస్ దిగ్గజం, స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ విషయాన్ని అతను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశాడు. తన కెరీర్ మొత్తంలో మద్దతుకు నిలిచిన వారికి నదాల్ కృతజ్ఞతలు తెలిపాడు. నదాల్ వచ్చే నెలలో (నవంబర్) జరుగబోయే డేవిస్ కప్‌లో చివరిసారి స్పెయిన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల నదాల్ తన సుదీర్ఘ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. నదాల్‌కు మట్టి కోర్టు వీరుడిగా పేరుంది.
నదాల్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఇవే..
➣ ఆస్ట్రేలియా ఓపెన్ (2009, 2022) - 2
➣ ఫ్రెండ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022) - 14
➣ వింబుల్డన్ (2008, 2010) - 2
➣ యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019) - 4
Dipa Karmakar: రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
#Tags