Pooja Singh: హైజంప్‌లో పూజా సింగ్‌ జాతీయ రికార్డు

భారత యువ అథ్లెట్‌ పూజా సింగ్‌ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది.

17 ఏళ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును (1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.

సరైన సౌకర్యాలు లేకుండానే అండర్‌–14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ.. ఆ తర్వాత 2022 జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–16, అండర్‌–18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది. 

Paris Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు..
#Tags