Oscar Piastri: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ విజేత ఆస్కార్‌ పియాస్ట్రి

సెప్టెంబ‌ర్ 15వ తేదీ జరిగిన సీజన్‌లోని 17వ రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి విజేతగా నిలిచాడు.

నిర్ణీత 51 ల్యాప్‌లను ఆస్కార్‌ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 
 
ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్‌ప్రిలోనూ ఆస్కార్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన లెక్‌లెర్క్‌ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్‌లో అప్పటి వరకు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న లెక్‌లెర్క్‌ను ఆస్కార్‌ పియాస్ట్రి ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. 

మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ జార్జి రసెల్‌కు మూడో స్థానంలో, మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ లాండో నోరిస్‌కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఐదో స్థానంలో నిలిచారు. 

US Open: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్.. రూ.30 కోట్ల ప్రైజ్ మనీ

#Tags