Indian Grandmaster Praggnanandhaa: ప్రపంచ నంబర్‌వన్‌పై నెగ్గిన భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్!

నార్వే చెస్ టోర్నమెంట్‌లో 18 ఏళ్ల భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు.

ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్ వన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్పై సంచలన విజయం నమోదు చేశాడు. కార్ల్‌సన్ సొంతగడ్డ నార్వేలో జరుగుతున్న ఈ టోర్నీ మూడో రౌండ్‌లో ఈ ఘనత సాధించాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు.

ఈ విజయంతో టోర్నీ మూడో రౌండ్ ముగిసే సమయానికి ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కార్ల్‌సన్ 3 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. గతంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్‌సన్‌ను ఓడించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఉన్నా, క్లాసికల్ ఫార్మాట్‌లో ఇది ప్రజ్ఞానందకు తొలి విజయం. టైమ్ లిమిట్ లేని క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన రెండో భారతీయ క్రీడాకారుడుగా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఈ ఘనతకు ముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే చేరుకున్నాడు.

Challenger Tennis Tourney: చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో సంచలన విజయం సాధించిన నిశేష్‌!

వైశాలి, హంపి గెలుపు..
ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో వైశాలితో పాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్‌లలో గెలిచారు.

#Tags