Asian Cup Table Tennis 2022: తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక బత్రా..

భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బత్రా చరిత్ర సృష్టించింది. ఏషియన్‌ కప్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా సెమీఫైనల్లోకి వెళ్లింది.

నవంబర్‌ 18న జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్‌ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ చెన్‌ సు యు (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. ప్రపంచ మహిళల టిటి ర్యాంకింగ్స్‌లో మనిక 44వ స్థానంలో ఉండగా.. చెన్‌ 23వ ర్యాంక్‌లో ఉన్నారు. న‌వంబ‌ర్‌17న‌ జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లోనూ మనిక ప్రపంచ 7వ ర్యాంకర్‌ కింగ్‌టన్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. సెమీస్‌లో మనిక జియోన్‌ జిహీ(కొరియా), మిమా ఇటో(జపాన్‌) మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.
National sports awards : శ్రీజ, నిఖత్‌లకు ‘అర్జున’.. శరత్‌ కమల్‌కు ‘ఖేల్‌రత్న’

#Tags