World Blitz Championship: ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపికి రజతం
భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది.
నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా.. 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ.33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ.24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ.16 లక్షల 55 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా.. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్లో, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్లో నిలిచారు.
FIFA World Cup: వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మెస్సి రికార్డు
#Tags