ICC Chairman: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా.. బాధ్యతలు ఎప్పుడు చేపడతారంటే..?

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కొత్త చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్‌ బార్క్‌లే మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయ‌డంతో ఎన్నిక ఎకగ్రీవమైంది. 
 
35 ఏళ్లకే అత్యున్నత పదవీ బాధ్యతలు దక్కించుకున్న జై షా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతారు. భారత్‌ నుంచి ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. 
 
గతంలో జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్, ఎన్‌.శ్రీనివాసన్, శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

BCCI: దేశవాళీ క్రికెట్‌లో ప్రోత్సాహకాలు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’కు ప్రైజ్‌మనీ

2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ భాగం కావడంతో దానికి తగినంత ప్రచారం నిర్వహించడం, రోజు రోజుకు ప్రభ తగ్గుతున్న టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తేవడం, టీ20ల ప్రభావంతో ప్రాధాన్యత కోల్పోతున్న వన్డేలను మరింత రసవత్తరంగా మార్చడం.. ఇలాంటి వాటికి జై షా పని చేయనున్నారు.

#Tags