IPL 2024 Auction Players List : ఐపీఎల్‌-2024 వేలంలో ఉన్న‌ ఆటగాళ్లు వీళ్లే.. ఇప్ప‌టి వ‌ర‌కు భారీ ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్-2024 స‌మ‌రంకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అలాగే 2024 ఐపీఎస్ వేలం డిసెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్‌ కోసం 17 కోట్లు ముట్ట జెప్పింది.

కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్‌ శర్మ (2023 సీజన్‌లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్‌ పంత్‌ (2023లో 16 కోట్లు, యువరాజ్‌ సింగ్‌ (2015లో 16 కోట్లు) ఉన్నారు.  వీరి తర్వాత ఇషాన్‌ కిషన్‌ (2022లో 15.25 కోట్లు), యువరాజ్‌ సింగ్‌ (2014లో 14 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు.

దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా రేపు (డిసెంబర్‌ 19) జరుగబోయే ఐపీఎల్‌ 2024 వేలంలో 77 స్లాట్‌ల కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  వేలం​ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది.

ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమైన తరుణంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం(డిసెంబరు 19)నాటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లు వీరేనంటూ తన అంచనాలు తెలియజేశాడు. అయితే, ఈ వేలంలో హాట్‌కేక్‌గా మారతాడనుకున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 హీరో ట్రవిస్‌ హెడ్‌ విషయంలో మాత్రం అశ్విన్‌ ట్విస్ట్‌ ఇవ్వడం విశేషం. అశ్విన్‌ అంచనా ప్రకారం.. దుబాయ్‌ వేదికగా జరుగునున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలంలో తమిళనాడు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ షారుఖ్‌ ఖాన్‌ 10-14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడు. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌-2023లో సెంచరీలతో విరుచుకుపడిన రచిన్‌ రవీంద్రకి రూ. 4-7 కోట్ల మేర దక్కే అవకాశం ఉంది.  

ఇక టీమిండియా బౌలర్‌ హర్షల్‌ పటేల్‌, వెస్టిండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌, సౌతాఫ్రికా బౌలర్‌ గెరాల్డ్‌ కోయెట్జీలు రూ. 7-10 కోట్ల మేర ధర పలికే ఛాన్స్‌ ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ రేంజ్‌ మాత్రం రూ. 2- 4 కోట్ల మధ్యే ఉంటుందని అశ్విన్‌ అంచనా వేయడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ ఐపీఎల్‌-2024 వేలంలో రూ. 4- 7 కోట్లకు అమ్ముడుపోగలడని అశ్విన్‌ పేర్కొన్నాడు. అదేవిధంగా.. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ మాత్రం రూ.14 కోట్ల మార్కును దాటగలరని అశూ పేర్కొనడం విశేషం.

సోషల్‌ మీడియా వేదికగా ఈ మేరకు తన అంచనాలు తెలియజేసిన అశ్విన్‌.. క్రికెట్‌ షాట్ల రూపంలో ఎవరు ఎంత ధర పలికే అవకాశం ఉందని తెలియజేయడం మరో విశేషం. డిఫెన్స్‌ షాట్‌(రూ.2-4 కోట్ల మధ్య), డ్రైవ్‌(రూ.4-7), పుల్‌షాట్‌(రూ. 7-10 కోట్లు), స్లాగ్‌(రూ. 10-14 కోట్లు), హెలికాప్టర్‌ షాట్‌(14+ కోట్లకు పైగా) అంటూ అశ్విన్‌ వివిధ రేంజ్‌ల మధ్య ఉంటారనుకున్న ప్లేయర్ల పేర్లను ఇలా షాట్లతో పోల్చి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై లుక్కేయండి!

ఐపీఎల్‌ 2024 వేలం తేదీ : డిసెంబర్‌ 19, 2023
సమయం : మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం)
వేదిక : దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా
ప్రత్యక్ష ప్రసారం : స్టార్‌ స్పోర్ట్స్‌ (టీవీ)
డిజిటల్‌: జియో సినిమా
మొత్తం స్లాట్‌లు : 77
వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు : 333
భారతీయ ఆటగాళ్లు : 214
విదేశీ ఆటగాళ్లు : 119

ఐపీఎల్‌ 2024 వేలం పాట‌లో ఉన్న ఆట‌గాళ్లు వీరే..

రూ.2 కోట్ల బేస్ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే.. : 

హ్యారీ బ్రూక్‌
ట్రవిస్‌ హెడ్‌
రిలీ రొస్సో
స్టీవ్‌ స్మిత్‌
గెరాల్డ్‌ కొయెట్జీ
పాట్‌ కమిన్స్‌
హర్షల్‌ పటేల్‌
శార్దూల్‌ ఠాకూర్‌
క్రిస్‌ వోక్స్‌
జోష్‌ ఇంగ్లిస్‌
లోకీ ఫెర్గూసన్‌
జోష్‌ హాజిల్‌వుడ్‌
మిచెల్‌ స్టార్క్‌
ఉమేశ్‌ యాదవ్‌
ముజీబ్‌ రెహ్మాన్‌
ఆదిల్‌ రషీద్‌
రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌
జేమ్స్‌ విన్స్‌
సీన్‌ అబాట్‌
జేమీ ఓవర్టన్‌
డేవిడ్‌ విల్లే
బెన్‌ డకెట్‌
ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

కోటి 50 లక్షల బేస్‌ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..: 
వనిందు హసరంగ
ఫిలిప్‌ సాల్ట్‌
కొలిన్‌ మున్రో
షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌
టామ్‌ కర్రన్‌
జేసన్‌ హోల్డర్‌
మొహమ్మద్‌ నబీ
జేమ్స్‌ నీషమ్‌
డేనియల్‌ సామ్స్‌
క్రిస్‌ జోర్డన్‌
టైమాల్‌ మిల్స్‌
జై రిచర్డ్‌సన్‌
టిమ్‌ సౌథీ

కోటి బేస్‌ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..: 
రోవ్‌మన్‌ పావెల్‌
డారిల్‌ మిచెల్‌
అల్జరీ జోసఫ్‌
ఆష్టన్‌ టర్నర్‌
ఆస్టన్‌ అగర్‌
మైకేల్‌ బ్రేస్‌వెల్‌
డ్వేన్‌ ప్రిటోరియస్‌
సామ్‌ బిల్లింగ్స్‌
గస్‌ అట్కిన్సన్‌
కైల్‌ జేమీసన్‌
రిలే మెరిడిత్‌
ఆడమ్‌ మిల్నే
వేన్‌ పార్నెల్‌
డేవిడ్‌ వీస్‌

రూ.75 ల‌క్ష‌ల‌ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..:
ఐష్‌ సోధి
ఫిన్‌ అలెన్‌
ఫేబియన్‌ అలెన్‌
కీమో పాల్‌
షాయ్‌ హోప్‌
తస్కిన్‌ అహ్మద్‌
మాట్‌ హెన్రీ
లాన్స్‌ మోరిస్‌
ఓలీ రాబిన్సన్‌
బిల్లీ స్టాన్‌లేక్‌
ఓల్లీ స్టోన్‌

రూ.50 లక్షల ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..

కరుణ్‌ నాయర్‌
మనీశ్‌ పాండే 
అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌
రచిన్‌ రవీంద్ర
కేఎస్‌ భరత్‌
కుశాల్‌ మెండిస్‌
ట్రిస్టన్‌ స్టబ్స్‌
దిల్షన్‌ మధుషంక
శివమ్‌ మావీ
చేతన​ సకారియా
జయదేవ్‌ ఉనద్కత్‌
అకీల్‌ హొసేన్‌
మొహమ్మద్‌ వకార్‌ సలామ్‌కీల్‌
తబ్రేజ్‌ షంషి
అలిక్‌ అథాంజే
మార్క్‌ చాప్‌మన్‌
సామ్యూల్‌ హెయిన్‌
రీజా హెండ్రిక్స్‌
బ్రాండన్‌ కింగ్‌
ఇబ్రహీం జద్రాన్‌
నజీబుల్లా జద్రాన్‌
వెస్లీ అగర్‌
ఖౌస్‌ అహ్మద్‌
రెహాన్‌ అహ్మద్‌
చరిత్‌ అసలంకఔ
బ్రైడన్‌ కార్స్‌
బెన్‌ కట్టింగ్‌
మాథ్యూ ఫోర్డ్‌
జార్జ్‌ లిండే
కేశవ్‌ మహారాజ్‌
వియాన్‌ ముల్డర్‌
దసున్‌ షనక
మాథ్యూ షార్ట్‌
ఓడియన్‌ స్మిత్‌
హనుమ విహారీ
జాన్సన్‌ ఛార్లెస్‌
వరుణ​్‌ ఆరోన్‌
ఫరీద్‌ అహ్మద్‌
దుష్మంత చమీర
బెన్‌ డ్వార్షుయిష్‌
రిచర్డ్‌ గ్లీసన్‌
షోరీఫుల్‌ ఇస్లాం
స్పెన్సర్‌ జాన్సన్‌
సిద్దార్థ్‌ కౌల్‌
లహీరు కుమార
ఓబెద్‌ మెక్‌కాయ్‌
బ్లెసింగ్‌ ముజరబానీ
రిచర్డ్‌ నగరవ
జార్జ్‌ స్క్రిమ్‌షా
భరిందర్‌ శ్రన్‌
ఒషేన్‌ థామస్‌
నువాన్‌ తిసార
సందీప్‌ వారియర్‌
లిజాడ్‌ విలియమ్స్‌
లూక్‌ వుడ్‌

40 లక్షల బేస్‌ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..: 
షారుఖ్‌ ఖాన్‌
టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌
బెన్నీ హోవెల్‌
జలజ్‌ సక్సేనా

రూ.30 లక్షల ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..
కోర్బిన్‌ బోష్‌
కమలేశ్‌ నాగర్‌కోటీ
బసిల్‌ థంపీ
లలిత్‌ యాదవ్‌
ఎస్‌ మిథున్‌
ఇజ్‌హర్‌ ఉల్‌ హక్‌ నవీద్‌

రూ.20 ల‌క్ష‌ల‌ ధరలో ఉన్న‌ ఆట‌గాళ్లు వీరే..

ప్రియాంశ్‌ ఆర్య
సౌరవ్‌ చౌహాన్‌
శుభమ్‌ దూబే
రోహన్‌ కున్ముమ్మల్‌
అంగ్రిష్‌ రఘువంశీ
సమీర్‌ రిజ్వి
మనన్‌ వోహ్రా
రాజ్‌ అంగద్‌ బవా
మొహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌
సర్ఫరాజ్‌ ఖాన్‌
అర్షిన్‌ కులకర్ణి
వివ్రాంత్‌ శర్మ
అతీత్‌ సేథ్‌
హృతిక్‌ షోకీన్‌
రమన్‌దీప్‌ సింగ్‌
రికీ భుయ్‌
కుమార్‌ కుషాగ్రా
ఉర్విల్‌ పటేల్‌
విష్ణు సోలంకీ
రసిక్‌ దార్‌
యశ్‌ దయాల్‌
సుశాంత్‌ మిశ్రా
ఇషాన్‌ పోరెల్‌
ఆకాశ్‌ సింగ్‌
కార్తీక్‌ త్యాగి
కుల్దీప్‌ యాదవ్‌
మురుగన్‌ అశ్విన్‌
శ్రేయస్‌ గోపాల్‌
పుల్కిత్‌ నారంగ్‌
ఎం సిద్దార్థ్‌
శివ సింగ్‌
మనవ్‌ సుతార్‌
దినేశ్‌ బనా
స్వస్తిక్‌ చిక్కరా
రజత్‌ డే
అభిమన్యు  ఈశ్వరన్‌
రితిక్‌ ఈశ్వరన్‌
చిరాగ్‌ గాంధీ
నికిల్‌ గంగ్‌తా
సుదీప్‌ ఘరామీ
అన్ష్‌ గోసాయి
అజిమ్‌ ఖాజీ
అమన్‌దీప్‌ ఖరే
అంకిత్‌ కుమార్‌
భేపేన్‌ లల్వానీ
పుక్‌రాజ్‌ మాన్‌
తన్మయ్‌ మిశ్రా
సల్మాన్‌ నిజార్‌
ప్రియాంక్‌ పంచల్‌
అక్షత్‌ రఘువంశీ
ఏకాంత్‌ సేన్‌
సుబ్రాన్షు సేనాపతి
నౌషద్‌ షేక్‌
ధృవ్‌ షోరే
హిమ్మత్‌ సింగ్‌
విరాట్‌ సింగ్‌
శశాంక్‌ సింగ్‌
సుమీత్‌ వర్మ
పీఏ అబ్దుల్‌
మురుగన్‌ అభిషేక్‌
అథర్వ అంకోలేకర్‌
బాబా అపరాజిత్‌
జసిందర్‌ బైద్వాన్‌
రాహుల్‌ బుద్దీ
వైశాక్‌ చంద్రన్‌
వ్రిత్తిక్‌ చటర్జీ
రాజ్‌ చౌదరీ
రవి చౌహాన్‌
అశ్విన్‌ దాస్‌
ఆర్య దేశాయ్‌
ఆర్య దేశాయ్‌
వినీత్‌ ధనకర్‌
నమన్‌ ధిర్‌
హర్ష్‌ దూబే
ప్రేరిత్‌ దత్తా
జేక్‌ ఫ్రేజర్‌
శుభంగ్‌ హేగ్డే
సరాన్ష్‌ జైన్‌
డుయన్‌ జన్సెన్‌
మొహమ్మద్‌ కైఫ్‌
అన్షుల్‌ కంబోజ్‌
అమన్‌ ఖాన్‌
అర్సలన్‌ ఖాన్‌
ముషీర్‌ ఖాన్‌
సుమిత్‌ కుమార్‌
మన్వంత్‌ కుమార్‌
సౌరబ్‌ కుమార్‌
దేవ్‌ లక్రా
నసీర్‌ లోన్‌
కౌశిక్‌ మైతీ
దివిజ్‌ మెహ్రా
మణిశంకర్‌ మురసింగ్‌
ఆబిద్‌ ముస్తాక్‌
సంజయ్‌ పహల్‌
జితిందర్‌ పాల్‌
అనుష్‌ పటేల్‌
సాయిరాజ్‌ పాటిల్‌
ప్రదోష్‌ పాల్‌
రోహిత్‌ రాయుడు
ఉత్కర్ష్‌ సింగ్‌
రవి తేజ
అవినాశ్‌ రావ్‌ అరవెల్లీ
హార్విక్‌ దేశాయ్‌
బాబ ఇంద్రజిత్‌
ఆదిత్య తారే
కేఎస్‌ ఆసిఫ్‌
బాసిత్‌ బషీర్‌
గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌
నండ్రే బర్గర్‌
అర్పిత్‌ గులేరియా
రాజ్‌ లింబాని
బాసిల్‌ థంపి
పాల్‌ వాన్‌ మీకెరెన్‌
నితిన్‌ వర్మ
క్రిస్‌ వుడ్‌
లలిత్‌ యాదవ్‌
పృథ్వీ రాజ్‌ యర్రా
కేసీ కరియప్ప 

20 లక్షల విభాగంలో ఇంకా 89 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

సామ్‌ కర్రన్‌- 18.5 కోట్లు (2023, పంజాబ్‌ కింగ్స్‌)
కెమారూన్‌ గ్రీన్‌- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్‌)
బెన్‌ స్టోక్స్‌- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్‌ కింగ్స్‌)
క్రిస్‌ మోరిస్‌- 16.25 కోట్లు (2021,రాజస్తాన్‌ రాయల్స్‌)
నికోలస్‌ పూరన్‌- 16 కోట్లు (2023, లక్నో సూపర్‌ జెయింట్స్‌)
యువరాజ్‌ సింగ్‌-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌)
పాట్‌ కమిన్స్‌-15.5 కోట్లు (2020, కేకేఆర్‌)
ఇషాన్‌ కిషన్‌-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్‌)
కైల్‌ జేమీసన్‌-15 కోట్లు (2021, ఆర్సీబీ)
బెన్‌ స్టోక్స్‌-14.5 కోట్లు (2017, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌)

సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..

2023: సామ్‌ కర్రన్‌- 18.5 కోట్లు (పంజాబ్‌ కింగ్స్‌)
2022: ఇషాన్‌ కిషన్‌-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్‌)
2021: క్రిస్‌ మోరిస్‌- 16.25 కోట్లు (రాజస్తాన్‌ రాయల్స్‌)
2020: పాట్‌ కమిన్స్‌-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌)
2019: జయదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP) 
2018: బెన్‌ స్టోక్స్‌- 12.5 కోట్లు (రాజస్తాన్‌ రాయల్స్‌)
2017: బెన్‌ స్టోక్స్‌-14.5 కోట్లు (రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌)
2016: షేన్‌ వాట్సన్‌- 9.5 కోట్లు (ఆర్సీబీ)
2015: యువరాజ్‌ సింగ్‌-16 కోట్లు (ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌)
2014: యువరాజ్‌ సింగ్‌- 14 కోట్లు (ఆర్సీబీ)
2013: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్‌)
2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్‌కే)
2011: గౌతమ్‌ గంభీర్‌- 14.9 కోట్లు (కేకేఆర్‌)
2010: షేన్‌ బాండ్‌, కీరన్‌ పోలార్డ్‌- 4.8 కోట్లు (కేకేఆర్‌, ముంబై)
2009: కెవిన్‌ పీటర్సన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్‌కే)
2008: ఎంఎస్‌ ధోని- 9.5 కోట్లు (సీఎస్‌కే)

#Tags