Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షాట్‌గన్‌ జట్టు ఇదే..

పారిస్ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్ తరఫున పాల్గొనే ఐదుగురు సభ్యుల షాట్‌గన్‌ జట్టును భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

ఈ జట్టులో అందరూ తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

పురుషుల ట్రాప్: పృథ్వీరాజ్ తొండైమన్
మహిళల ట్రాప్: రాజేశ్వరి కుమారి
పురుషుల స్కీట్: అనంత్‌జీత్‌ సింగ్‌ నరూకా
మహిళల స్కీట్: రైజా ధిల్లాన్
మహిళల స్కీట్: మహేశ్వరి చౌహాన్
అనంత్, మహేశ్వరి స్కీట్ మిక్స్‌డ్‌ విభాగంలో కూడా పోటీపడతారు.

37 ఏళ్ల పృథ్వీరాజ్ తొండైమన్ ఇప్పటివరకు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒక స్వర్ణం, మూడు రజతాలు మరియు రెండు కాంస్య పతకాలు సాధించాడు.

పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. రైఫిల్, పిస్టల్ మరియు షాట్‌గన్ విభాగాలలో కలిపి భారతదేశం నుండి మొత్తం 21 మంది షూటర్లు ఈ పోటీలలో పాల్గొంటారు. 

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగ‌మ్మాయి ఈమెనే..

#Tags