U19 World Boxing Championship: అండర్‌–19 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 17 పతకాలు

అండర్‌–19 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు.

ఈ చాంపియన్‌షిప్‌లో టీనేజ్‌ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్‌)ను కంగుతినిపించింది. 
 
ప్లస్‌ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్‌ విక్టోరియా గాట్‌ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్‌ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్‌ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. 

పురుషుల్లో.. ఏకైక పసిడి పతకాన్ని హేమంత్‌ తెచ్చి పెట్టాడు. రాహుల్‌ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్‌ (50 కేజీలు), క్రిష్‌ పాల్‌ (55 కేజీలు), సుమిత్‌ (70 కేజీలు), ఆర్యన్‌ (85 కేజీలు), లక్షయ్‌ రాఠి (ప్లస్‌ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

World Wrestling Championship: ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు తొమ్మిది పతకాలు

#Tags