Shikhar Dhawan: సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్
అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు తెలిపాడు.
ఈ వీడియోలో శిఖర్ ధావన్.. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఇక తన ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని, వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ, డీడీసీఏ, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు.
శిఖర్ ధావన్.. టీమిండియాకు ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. 2010 నుంచి 2022 వరకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో.. 17 సెంచరీలతో 6793 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు.
మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేలకు పైగా పరుగులు చేశాడు. అలాగే మొత్తంగా 24 శతకాలు బాదాడు. వీటిలో వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు ఉన్నాయి. ధావన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Smriti Mandhana: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానకి మూడో ర్యాంక్