Handball Championship: భారత్‌లో తొలిసారి.. ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది.
ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి కజకస్తాన్‌లోని అల్మాటీ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వేదికను తరలించారు.
చాంపియన్‌షిప్‌లో భారత్‌తో పాటు ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, జపాన్, కజకిస్తాన్, హాంకాంగ్, సింగపూర్ జట్లు కూడా పాల్గొననున్నాయి.
భారత మహిళల జట్టు ఈ టోర్నీలో పాల్గొననుండటం ఇది ఎనిమిదోసారి కాగా.. ఇందులో అత్యుత్తమంగా మన జట్టు 2022, 2000లో ఆరో స్థానంలో నిలిచింది.
T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
#Tags