Women Under 19 World Cup Schedule : మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

2025 మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ ని ఐసీసీ (ఐఇఇ) విడుదల చేసింది. ఈ టోర్నీకి మలేసియా ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ పొట్టి కప్‌ జరగనుంది. మొత్తం 41 మ్యాచ్‌ లు నిర్వహిస్తారు. 16 జట్లను నాలుగు గ్రూప్‌ లుగా విభజించారు. ప్ర‌తీ గ్రూప్‌లో మొద‌టి మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ సిక్స్ ద‌శ‌కు చేరుకుంటారు. సూప‌ర్ సిక్స్‌లోని రెండు గ్రూప్‌ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుతాయి. స‌న్న‌ద్ధ‌త కోసం 16 వార్మ‌ప్ మ్యాచ్‌లు జ‌న‌వ‌రి 13 నుంచి 16వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

Asia Under 15: ఆసియా అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విజేత ఈ అమ్మాయే..

#Tags