Khel Ratna Awards: ‘ఖేల్‌రత్న’ అవార్డు అందుకోనున్న క్రీడాకారులు వీరే..

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్‌ కమిటీ 'ఖేల్‌ రత్న', 'అర్జున', 'ద్రోణాచార్య', 'ధ్యాన్‌చంద్' తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది.  

ఖేల్‌ రత్న అవార్డు: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించారు. హర్మన్‌ప్రీత్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా కాంస్యం గెలుచుకున్న జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అతను ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు, చాంపియన్స్‌ ట్రోఫీ వంటి ప్రధాన ఈవెంట్లలో భారత్‌కు పతకాలు గెలిచేందుకు కీలక పాత్ర పోషించాడు. దీనితో పాటు, పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా ఖేల్‌ రత్న కోసం సిఫారసు చేయబడ్డాడు. ప్రవీణ్‌ 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో హైజంప్ (టి64 క్లాస్) విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.

Junior Hockey Asia Cup: వరుసగా రెండోసారి.. జూనియర్‌ హాకీ ఆసియా కప్ భారత్‌దే..

  • మనూ భాకర్: పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్న మనూ భాకర్‌ పేరు ఖేల్‌ రత్న జాబితాలో లేనిది ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఆమె తండ్రి ఈ విషయంలో తన నిరసన వ్యక్తం చేశారు. పూర్వపు ప్రదర్శన ఆధారంగా ఆమె పేరు జాబితాలో చేరవచ్చు.

అర్జున అవార్డు: ఈ అవార్డుకు 30 మంది ఆటగాళ్లను నామినేట్‌ చేశారు. అందులో 13 మంది రెగ్యులర్‌ ఆటగాళ్లు, 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న రెజ్లర్‌ అమన్‌, షూటర్లు సరబ్‌జోత్, స్వప్నిల్‌ కుసాలే ఈ జాబితాలో చోటు పొందారు. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్‌ దీప్తి జివాంజి కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.

ద్రోణాచార్య అవార్డు: ఈ అవార్డుకు పారా షూటింగ్‌ కోచ్‌ సుభాష్‌ రాణా పేరును ప్రతిపాదించారు. కానీ, అమిత్‌ కుమార్‌ సరోహా పేరు కూడా ఈ జాబితాలో ఉండటం వివాదాలకు దారి తీసింది. ఎందుకంటే అతను అధికారిక కోచ్‌గా పనిచేయలేదని, ఇటీవల పారిస్‌లో ఆటగాడిగా బరిలోకి దిగిన కారణంగా ఈ అవార్డుకు అర్హుడు కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

World Chess Championship: 18 ఏళ్లకే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..

#Tags