Indian Grand Prix-2 Athletics Meet: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో శ్రీనివాస్‌కు స్వర్ణం.. శిరీషకు కాంస్యం

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు పతకాలతో మెరిశారు.

మే 30వ తేదీ చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్‌ స్వర్ణ పతకం సాధించగా.. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్‌ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. 

ఇదే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ చాంపియన్‌షిప్‌లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్‌–20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీనివాస్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది.

Asian Championship: తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

#Tags