Retirement: హాకీకి వీడ్కోలు పలికిన భారత స్టార్‌ ఆటగాళ్లు?

టోక్యో ఒలింపిక్స్‌–2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్, డిఫెండర్‌ బీరేంద్ర లక్డాలు ఒకే రోజు సెప్టెంబర్‌ 30న అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్‌ ప్రకటించారు. పంజాబ్‌కు చెందిన 30 ఏళ్ల రూపిందర్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 223 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. యువ ప్లేయర్లకు అవకాశం ఇచ్చేందుకు రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నానని రూపిందర్‌ పేర్కొన్నాడు. ఒడిశాకు చెందిన బీరేంద్ర తన 9 ఏళ్ల కెరీర్‌లో 201 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టోక్యోలో భారత హాకీ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

చ‌ద‌వండి: టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : హాకీకి వీడ్కోలు పలికిన భారత స్టార్‌ ఆటగాళ్లు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 30
ఎవరు    : డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్, డిఫెండర్‌ బీరేంద్ర లక్డా 
ఎందుకు : పలు కారణాల రీత్యా...

#Tags