Skip to main content

Retirement: టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?

Moeen Ali

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ టెస్టు ఫార్మాట్‌కు పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 27న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. వన్డే, టి20 ఫార్మాట్‌లలో తన కెరీర్‌ను పొడిగించుకునేందుకు టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు 34 ఏళ్ల మొయిన్‌ అలీ తెలిపాడు. 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మొయిన్‌ ఇప్పటివరకు 64 టెస్టులు ఆడి 2,914 పరుగులు సాధించాడు. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేసే అతను... టెస్టుల్లో 195 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ టి20 టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

అగ్రశ్రేణి క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?

సెప్టెంబర్‌ 27న విడుదలైన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి ఆర్చర్‌ జ్యోతి సురేఖ ఏకంగా ఎనిమిది స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ 5వ ర్యాంక్‌లో నిలిచింది. కాంపౌండ్‌ విభాగంలో ఇప్పటివరకు భారత ఆర్చర్‌ సాధించిన అత్యుత్తమ ర్యాంక్‌ ఇదే. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో సురేఖ క్రితంసారి 13వ ర్యాంక్‌లో నిలిచింది. మరోవైపు రికర్వ్‌ విభాగం మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఆన్‌ సాన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి కొత్త వరల్డ్‌ నంబర్‌వన్‌గా అవతరించింది. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న దీపిక కుమారి రెండో ర్యాంక్‌కు పడిపోయింది.

చ‌ద‌వండి: ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించిన క్రీడాకారిణి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ
ఎందుకు  : వన్డే, టి20 ఫార్మాట్‌లలో తన కెరీర్‌ను పొడిగించుకునేందుకు...

 

Published date : 28 Sep 2021 03:36PM

Photo Stories