IPL 2024: బీసీసీఐ కీలక ప్రకటన.. ఐపీఎల్ 2024 విజయానికి కారణమైన వారికి భారీ బహుమతి!

చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 17వ సీజన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన 'అన్‌సంగ్ హీరో'లకు భారీ బహుమతి ప్రకటించారు.

గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్లకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు జై షా వెల్లడించారు. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించిన 10 వేదికల సిబ్బందికి రూ.25 లక్షలు, అదనంగా సేవలు అందించిన 3 వేదికల సిబ్బందికి రూ.10 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నారు.

IPL 2024: ఐపీఎల్‌-17 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే..!

"తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్‌ కావడానికి గ్రౌండ్‌ సిబ్బంది నిర్విరామంగా కృషి చేయడం కారణం. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం" అని జై షా ట్వీట్‌ చేశారు.

 

 

#Tags