US Open 2024: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఈమెనే.. ప్రైజ్ మనీ ఎంతంటే..

2024 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్‌ స్టార్‌ అరీనా సబలెంకా నిలిచింది.

గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది.  

ప్రైజ్‌మనీ ఎంతంటే..
విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ.30 కోట్ల 23 లక్షలు), రన్నరప్‌ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ.15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో నిష్క్ర‌మించింది. తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది.

సబలెంకా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌. 2023, 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకుంది. 

Paralympics: పారాలింపిక్స్‌లో వరుసగా ఐదోసారి పసిడి పతకం సాధించిన‌ రౌవా తిలీ

#Tags