Winter Solstice: డిసెంబర్‌ 21న సూర్యకాంతి ఉండేది 8 గంటలే.. మిగిలిన 16 గంటలు సుదీర్ఘరాత్రే..

సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది.

ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష్య దిశలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటారు. 

ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్‌ 21న వింత చూడబోతున్నాం. ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడనుంది. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం, 8 గంటల పాటు పగలు సమయం మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం (వింటర్‌ సోల్‌స్టైస్‌) అంటారు.  

సూర్యుడికి సుదూరంగా భూమి 
శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ధ్రువం వద్ద 23.5 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024లో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది. దీంతో సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడి కాంతి 16 గంటల వరకు ఉంటుంది. భూమి తన అక్ష్యం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. 

ఆ సమయంలో ఏర్పడే దానినే అయనాంతరం అంటారు. సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బింధువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. 

Jupiter Moon: బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు.. నిత్యం జ్వలిస్తున్న అగ్నిపర్వతాలు!

ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం. సంవత్సరం పొడవునా, ఉత్తర లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి కాలపు అయనాంతం అనేది అత్యంత పొడవైన రోజు. 

అయనాంతంపై ప్రగాఢ నమ్మకాలు  
శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలో పలురకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్‌ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఉత్తర భారత్‌లో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  

21న తగ్గనున్న ఉష్ణోగ్రతలు 
శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. అయితే, కచ్చితంగా డిసెంబర్‌ 20 నుంచి 23 తేదీలలోపు మాత్రమే వస్తుంటుంది. ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సూర్యకిరణాలు అలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 

Andromeda Galaxy: నక్షత్ర మండలంలో తొలిసారి పరారుణ ఉద్గారాల గుర్తింపు

ఇదో వింత అనుభూతి 
భూ భ్రమణంలో భాగంగా సూ­ర్యుడు, భూమి మధ్య దూ­రం ఏడాదిలో ఒక్కసారి పెరగడం,  తగ్గడం జరుగుతుంటుంది. వేసవిలో సూర్యుడికి దగ్గరగానూ, శీతాకాలంలో సూర్యుడికి దూరంగా భూభ్రమణం జరుగుతుంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేసవి అయనాంతంగానూ, సూర్యుడికి సుదూరంగా భూభ్రమణం జరిగినప్పుడు శీతాకాలపు అయనాంతంగా పేర్కొంటారు. – నెహ్రూ, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌

#Tags