SpaceX Falcon 9: కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్‌ శాటిలైట్లు.. కారణం ఇదే..

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

జూలై 11వ తేదీన ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయని స్పేస్‌ ఎక్స్‌ స్వయంగా ధ్రువీకరించింది.

ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే, ఫాల్కన్-9 రాకెట్ యొక్క రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. ఈ లోపం వలన, ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు చేరుకోలేక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశించాయి. ఫలితంగా, వాటి మనుగడ అసాధ్యంగా మారింది, త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతాయి.

స్పేస్‌ ఎక్స్ ఈ ఘటనను ధ్రువీకరించింది, ఈ 20 ఉపగ్రహాల వైఫల్యం వలన ఇతర ఉపగ్రహాలకు ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే.. ఉపగ్రహాలు భూమిని తాకినా, జనావాసాలకు ఎటువంటి ముప్పు ఉండదని కూడా స్పష్టం చేసింది. ఈ ఘటన ఫాల్కన్-9 రాకెట్ చరిత్రలోనే తొలి భారీ వైఫల్యంగా పరిగణించబడుతుంది.

LHS 1140b: విశ్వంలో భూగోళం లాంటి మరో గ్రహం.. ఇది కూడా జీవుల నివాస‌యోగ్య‌మైన గ్ర‌హమే!

#Tags